prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:12 pm Digital Edition : PRAJA VANI

నూతన రేషన్ కార్డుల పంపిణి

నూతన రేషన్ కార్డుల పంపిణి

ప్రజా వాణి,వికారాబాద్ న్యూస్:
వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామపంచాయతీలో బుధవారం గ్రామ సర్పంచ్ సుజాత ప్రహ్లాద్ రెడ్డి,మరియు పంచాయతీ సెక్రెట్రీ జయసింహారెడ్డి,స్థానిక నాయకులతో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం సర్ నోటీసుల కు సరైన పత్రాలు తీసుకొని ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేశారు.అనంతరం సోషల్ ఆడిట్ నిర్వహించారు.ఉపాధి హామీ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఉపాధి హామీ పథకం నిరుపేదలకు చాలా మంచిది పథకం కాబట్టి ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు వెళ్లాలని గ్రామ సర్పంచ్ అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు,మరియు గ్రామ పెద్దలు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.