నూతన ఐరన్, హార్డ్‌వేర్ షాప్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మల్లికార్జున ఐరన్, హర్డ్‌వేర్ & పెయింట్స్ షాప్‌ను సోమవారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నూతన వ్యాపారం దినదినాభివృద్ధి చెంది, యజమానులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. అలాగే షాప్ యజమానులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.