prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 12:00 pm Digital Edition : PRAJA VANI

నూతన ఐమాక్స్ లైట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్

*నూతన ఐమాక్స్ లెట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్*

*ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ నిధులతో మంజూరైన ఐమాక్స్ లెట్ ప్రారంభం*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 23 సంగారెడ్డి జిల్లా*

సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్: నియోజకవర్గం, మానూర్ మండల దూదగొండ గ్రామంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ నిధులతో మంజూరైన నూతన ఐమాక్స్ లెట్‌ను ఈరోజు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు సహకరించిన ఎంపీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు,నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివకాంత్ పటేల్, ఉపసర్పంచ్ అనిల్ కుమార్, మోహన్ వార్డు సభ్యులు, చందుపటేల్, నర్సింలు, ధనరాజ్ పటేల్, శ్రీను పటేల్, పవన్, రాఘవులు, శంకర్ పటేల్ రాజు,పాల్గొన్నారు.