నూతన ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): ఘట్‌కేసర్ పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌ను ఘట్‌కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్, తెలంగాణ జన సమితి (టీజేఎస్) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యలను ఆయన ఎస్‌హెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గత 17 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న పనులు, రహదారుల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. గతంలో ఘట్‌కేసర్‌లో పనిచేసిన...