prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 6:14 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నూతన ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): ఘట్‌కేసర్ పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌ను ఘట్‌కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్, తెలంగాణ జన సమితి (టీజేఎస్) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యలను ఆయన ఎస్‌హెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా గత 17 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న పనులు, రహదారుల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. గతంలో ఘట్‌కేసర్‌లో పనిచేసిన పోలీసు అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో జేఏసీకి అందించిన సహకారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

జేఏసీ ప్రతినిధులు వివరించిన సమస్యలను ఎస్‌హెచ్‌ఓ కిరణ్ సానుకూలంగా విన్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి జేఏసీకి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు మారం లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖతో సమన్వయంతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.