నూతనకల్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

*నూతనకల్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు* *కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు* మేడ్చల్ నేటి ప్రస్థానం: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు వివిధ రకాల రంగురంగుల...