నిరుపేద వైద్య చికిత్సకు రూ.2 లక్షల సీఎం సహాయ నిధి
బాధిత కుటుంబానికి మంజూరు పత్రం అందజేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (ప్రజావాణి):
నిరుపేదలకు వైద్య చికిత్స భారంగా మారకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన శ్రీమతి చాగంటి పూలకు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF-LOC) ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఈ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన బాధితులకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని, అత్యవసర వైద్య చికిత్సల సమయంలో పేదలకు అండగా నిలుస్తోందని గాంధీ వివరించారు.
తమ వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా సహకరించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.