prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 2:40 pm Digital Edition : PRAJA VANI

నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు

*నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపిన*

*మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా*

నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నారాయణఖేడ్‌లోని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నివాసంలో, (కృష్ణ గౌడ్ ఇంటి వద్ద) ఏర్పాటు చేసిన *దసరా అలయ్ బలయ్ కార్యక్రమం* ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి కి జమ్మి ఆకులు సమర్పించి, అలయ్ బలయ్ నిర్వహిస్తూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ పండుగ ఆనందాలను పంచుకున్నారు.

దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆత్మీయత మరింత బలపడాలని కోరుకున్నారు.

సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యతను చాటిచెప్పే అలయ్ బలయ్ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒకేచోట చేరి దసరా వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.