నాగలకుంట్ల గ్రామంలో వైభవంగా ఆర్సిఎమ్ (RCM) చర్చి ప్రారంభోత్సవం: పాల్గొన్న కడప పీఠాధిపతులు డాక్టర్ సగిణాల ప్రకాశం తండ్రి
పోరుమామిళ్ల: కడప జిల్లా అక్టోబర్ 25 ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలోని నాగలకుంట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆర్సిఎమ్ (రోమన్ క్యాథలిక్ మిషన్) దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప పీఠాధిపతులు (బిషప్) డాక్టర్ సగిణాల ప్రకాశం తండ్రి విచ్చేసి, నూతన చర్చిని రిబ్బన్ కత్తిరించి అధికారికంగా ప్రారంభించారు.దేవాలయ పవిత్రీకరణ అనంతరం ఆయన దివ్యబలి పూజను సమర్పించి భక్తులకు దైవ సందేశాన్ని అందించారు.ఆధ్యాత్మిక నిలయాలుగా చర్చిలు:ఈ సందర్భంగా కడప పీఠాధిపతులు పూజ్య డాక్టర్...