*నవంబర్ 13 నుండి 16 వరకు అగ్రి షో – జూలకంటి రంగారెడ్డి*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా నల్గొండ పట్టణంలో అధునాతన యంత్రాల ఫెస్టిసైడ్స్ తదితర అంశాలపై రైతాంగానికి అవగాహన కల్పించడం కోసం నవంబర్ 13 నుండి 16 వరకు పెదగడియారం సెంటర్లో అగ్రిషో నిర్వహించడం జరుగుతుందని రైతు సంఘం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే లు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి లు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్ద గడియారం సెంటర్లోని పాత ఆర్ అండ్ బి ఐ బి కార్యాలయాల స్థలాల్లో నిర్వహిస్తున్న అగ్రి షో స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 15 నుండి 18 వరకు నల్గొండ పట్టణంలో అఖిలభారత రైతు సంఘం జాతీయ 36 వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆ మహాసభల సందర్భంగా 15 న భారీ బహిరంగ సభ జరుగుతుందని అన్నారు నవంబర్ 13 నుండి 16 వరకు పెద గడియార సెంటర్లోని ఐ బి, ఆర్ అండ్ బి కార్యాలయాల స్థలాలలో అధునాతన యంత్రాల వాడకం, ఎరువులు, విత్తనాలు పెస్టిసైడ్స్ అలీనోవా ప్రభావంతో వేయాల్సిన పంటలు తదితర అంశాలపై రైతాంగానికి అవగాహన కల్పించడం కోసం అగ్రి షో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అగ్రిషోలో నల్లగొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని వ్యవసాయంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని రైతు బాగున్నపుడే దేశం బాగుంటుందని అందుకో అనుగుణంగా మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని రైతాంగానికి సూచించారు. సుమారు 300 కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని వేలాదిమంది రైతులు ఈ షో పాల్గొని తిలకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు తుమ్మల వీరారెడ్డి కట్టా నరసింహ బండ శ్రీశైలం,పాలడుగు నాగార్జున, ఎండి సలీం ,దండెంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు గాదె నరసింహ వెంకట్ రెడ్డి రాజేందర్ రెడ్డి,సంతోష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.