prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:23 pm Digital Edition : PRAJA VANI

నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు

*నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు*

*క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ.197.44 కోట్లు*

*సుందరీకరణ లోగోను ఆవిష్కరించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి*

*నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మేయర్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. స్మార్ట్ సిటీలో భాగంగా పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ.197.44 కోట్లు మంజూరయ్యాయి. క్లాక్ టవర్ సెంటర్లోని పాత ఆర్ అండ్ బి కార్యాలయం స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్, అదేవిధంగా క్లాక్ టవర్ సెంటర్ ను అధునాతన రీతిలో డెవలప్ చేయడానికి ప్రపంచ బ్యాంకు రూ. 138.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.59.23 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్ లో మంజూరైన 197.44 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల లోగోను డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించారు. కార్పొరేషన్ లోని క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు నిధులు మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.