*నల్లగొండలో పార్టీలకతీతంగా అభివృద్ధి*
*స్మార్ట్ సిటీలో భాగంగా ఆరులైన్ల రోడ్డు విస్తరణ*
*మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నల్లగొండలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి*
*నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి*
*సాగర్ రోడ్డులో వైయస్సార్ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు శంకుస్థాపన*
*సంవత్సరంలో నల్లగొండ రూపురేఖలు మారుస్తాం*
*ప్రతిపక్షాలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారాలు*
*మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి*
*నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని డివిజన్లో పార్టీల కతీతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు శుక్రవారం నల్లగొండ పట్టణం సాగర్ రోడ్డు వైయస్సార్ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు స్థానిక కార్పొరేటర్, పార్టీ శ్రేణులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియడంతో ఇటీవల ఈ రోడ్డు ను పరిశీలించడం జరిగిందని అన్నారు. డివైడర్, సెంట్రల్ లైటింగ్ లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే నల్గొండ పట్టణంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 20 కోట్లు నిధులు మంజూరు చేశారని అన్నారు. పానగల్ నుంచి డీఈఓ ఆఫీస్ వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా నల్లగొండలో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేసేందుకు బ్రహ్మంగారి గుట్ట, లతీప్ సాబ్ గుట్టలకు ఘాట్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.
కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి, సాగర్ రోడ్డు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసిన సందర్భంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, పట్టణ ప్రజల తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో రూ.2,000 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. సాగర్ రోడ్లో వైయస్సార్ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు మూడున్నర కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్డు విష్కరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఆర్ అండ్ బి శాఖ నుంచి రూ.20 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నల్లగొండ లో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోతున్నట్లు తెలిపారు.
సంవత్సరంలో అభివృద్ధికి సంబంధించి నల్లగొండ రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రతిపక్షాలు కళ్ళులేని కబోధీలుగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు గుండబోయిన వెంకన్న యాదవ్, మామిడి కార్తీక్, రేగట్ట లింగస్వామి గౌడ్, ఇటికాల శ్రీనివాస్, ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, వజ్జ రమేష్ యాదవ్, ప్రదీప్ నాయక్, చిన్నాల జానయ్య, దీప్లా నాయక్, పిల్లి కృష్ణంరాజు, సట్టు శంకర్, జూలకంటి శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
