prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 5:57 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

నల్గొండ బస్ స్టాండ్ లో దసరా రద్దీ – బస్సుల కోసం పరుగులు పెడుతున్న ప్రయాణికులు – జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్

నల్గొండ బస్ స్టాండ్ లో దసరా రద్దీ – బస్సుల కోసం పరుగులు పెడుతున్న ప్రయాణికులు – జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్

నల్గొండ జిల్లా ప్రతినిధి, ప్రజావాణి

దసరా పండుగ సందర్భంగా నల్గొండ జిల్లా బస్ స్టాండ్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. సొంత ఊర్లకు వెళ్ళడానికి జనం విచ్చలవిడిగా బస్సుల కోసం పరుగులు పెడుతున్నారు. బస్సు వచ్చిందో లేదో ఎక్కడానికి తోసుకుంటూ వెళ్తుండటంతో తోపులాట జరుగుతోంది.
ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లగేజీతో పరుగులు పెడుతూ కింద పడిపోతున్నారు. ఇలాంటి పండుగ సమయంలో పోలీసు సిబ్బంది లేక, క్యూ పద్ధతి పాటించి, అదనపు బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. పోలీసు సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.