prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:06 pm Digital Edition : PRAJA VANI

నల్గొండ బస్ స్టాండ్ నుండి చండూర్ రూట్ బస్ మిస్సింగ్

నల్గొండ బస్ స్టాండ్ నుండి చండూర్ రూట్ బస్ మిస్సింగ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లాలో ఆర్ టి సి బస్సు సేవలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ బస్ స్టాండ్ నుండి చండూర్ వెళ్లే బస్సు ప్రతిరోజూ సాయంత్రం 5:20 నుండి 7:00 గంటల వరకు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఆఫీసులు, కాలేజీలు, పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలోనే బస్సు లేకపోవడం. దాదాపు 30 మంది ప్రయాణికులు ప్రతిరోజూ బస్ స్టాండ్ లో గంటన్నర పాటు వేచి ఉంటున్నారు. మహిళలు, చిన్న పిల్లలతో ఉన్నవారు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టిఎస్ఆర్టిసి నల్గొండ డిపో అధికారులు వెంటనే స్పందించి ఈ రూట్ లో సాయంత్రం ట్రిప్ ను క్రమం తప్పకుండా నడపాలని, ఒకవేళ బస్సు బ్రేక్ డౌన్ అయితే ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.