prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:44 pm Digital Edition : PRAJA VANI

నర్సాయపల్లి గ్రామసభలో వి బి జి రామ్ జి ప్రణాళికలు రూపకల్పన

నర్సాయపల్లి గ్రామసభలో వి బి జి రామ్ జి ప్రణాళికలు రూపకల్పన

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

సర్పంచ్ శనిగరం సత్యనారాయణ

మద్దూరు అక్టోబర్2, ప్రజా వాణి,

మండలంలోని నర్సాయపల్లి గ్రామ పంచాయతీలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సభకు హాజరైన వారందరికీ సర్పంచ్ 157 వ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో క్రింది అంశాలు చర్చించడం జరిగింది.
16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సరైన ప్రణాళిక సిద్ధం చేయడం
వి బి జి రామ్ జి పథకం ద్వారా 375 రకాల పనులను చేసుకోవచ్చు. అందులో గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాల కొరకు, అలాగే గ్రామంలో డ్రైనేజీ లు, కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణాలకు కొరకు, బోర్వెల్ రీఛార్జ్ సోక్ పిట్ లు,పారం పాండ్స్,నిర్మించుకోవాలని తీర్మానం చేశారు.
ఎస్ వి టి ఎం ఐ టి ఏ పథకం ద్వారా గ్రామీణ నివాస ప్రాంతాల్లో డ్రోన్ ఆధారిత సర్వే,ఆస్తుల మ్యాప్పింగ్ చేయడం గురించి ప్రజలకు తెలపడం జరిగింది.
గ్రామంలో అంగన్వాడి సెంటర్ నిర్మాణం.
ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్డు నిర్మాణం.
గ్రామంలో బాల్యవివాలను పూర్తిగా అరికట్టడం జరిగింది. మా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటిస్తూ తీర్మానం చేయడం జరిగింది.
నశా ముక్త్ భారత్ లో భాగంగా గ్రామంలో మాదకద్రవ్యాల బారిన పడకుండా యువకులను కాపాడుకునే బాధ్యత మనదిగా భావించి సంపూర్ణంగా నిషేధించాలని తీర్మానం చేశారు.
కొత్తగా తీసుకొచ్చిన నేర చట్టాల గురించి గ్రామసభలో వివరించారు.ఈ గ్రామసభ సమావేశానికి ఉప సర్పంచ్ మంతెన.భరత్ రెడ్డి వార్డు సభ్యులు గట్టు.సంతోష్,పోతుగంటి. విజయ,రాగుల. బాలనర్సయ్య, దోప్ప.కిషన్,తుమ్మల.శ్రీను మరియు పంచాయతీ కార్యదర్శి పి.భాస్కర్, ఏ పి ఏం ప్రకాశం, టి ఏ రమేష్ మరియు గ్రామ పెద్దలు,ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.