* *నర్సాపూర్ లో హోటళ్ల తనిఖీలు చేపట్టాలి*
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు – CPM డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు
నర్సాపూర్, అక్టోబర్ 16 మన ప్రజావాణి నియోజకవర్గ ప్రతినిధి
నర్సాపూర్ పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఆహార నాణ్యతపై వెంటనే తనిఖీలు నిర్వహించాలని CPM నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు డిమాండ్ చేశారు. CPM పార్టీ ఆధ్వర్యంలో RDOకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయంతో ప్రజలు, కార్మికులు, విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు. మూడు రోజుల క్రితం మండీ హోటల్ ఆహారం తిని ఒకరు మృతి చెందగా, 30 మందికి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, గురువారం సిటీ ప్యాలెస్ సమోసాలో గుట్కా లాంటి పదార్థం కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు దాసు పాల్గొన్నారు.