prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:24 am Digital Edition : PRAJA VANI

నరసింహులపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం

నరసింహులపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం

ప్రజా వాణి రిపోర్టర్ నర్సిహులపేట ,:

పట్టభద్రుల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం
కార్యక్రమానికి హాజరైన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్
నరసింహులపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కార్యక్రమంలో వివరించారు.
పట్టభద్రులు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకొని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైధం దేవేందర్, ఉగ్గంపల్లి సర్పంచ్ అయూబ్ పాషా, సీనియర్ నాయకులు బండ భిక్షం రెడ్డి, నరసింహ రెడ్డి , వెంకటరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కార్ల నాగన్న, బండి రమేష్, వంతడుపుల సర్పంచ్ బాలు నాయక్, గ్యమా తండా సర్పంచ్ నీలమ్మ వీరు, అన్ని గ్రామాల బిఆర్ఎస్ అధ్యక్షులు, కార్యకర్తలు, విద్యావంతులు పాల్గొన్నారు…