prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 7:56 pm Digital Edition : PRAJA VANI

నడిరోడ్డుపై వ్యాపారం చోద్యం చూస్తున్న అధికారులు

*నడిరోడ్డుపై వ్యాపారం చోద్యం చూస్తున్న అధికారులు*

మున్సిపాలిటీగా మారిన ప్రజలకు తప్పని ఇబ్బందులు

మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు అసహనం వ్యక్తం చేస్తున్న అశ్వారావుపేట మండల ప్రజలు

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 26)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భద్రాచలం మార్గంలో ఉల్లిగడ్డల హోల్సేల్ మార్కెట్ దగ్గర పట్టణానికి చెందిన బడా వ్యాపారులు నడిరోడ్డుపై వ్యాపారాలు చేస్తుంటే అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. సెంట్రల్ లైటింగ్ వచ్చింది పట్టణం అభివృద్ధి చెందుతుంది విశాలమైన రోడ్లు వస్తాయి అని సంబరపడిన పట్టణ ప్రజలకు నడిరోడ్డుపై వ్యాపారాలు చేస్తుంటే నిత్యం ప్రయాణం చేసే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోడ్లు విస్తీర్ణ మూడు నాళ్ళ ముచ్చట అన్నట్లుగా మారిందని ఎక్కడ చూసినా నడిరోడ్డుపై వ్యాపారాలు చేస్తుంటే ట్రాఫిక్ జామ్ అయ్యి పాదచారులు అలాగే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇకనైనా మున్సిపాలిటీ ధికారులు స్పందించి నడిరోడ్డుపై వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు,