prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 3:35 pm Digital Edition : PRAJA VANI

నగర పారిశుద్ధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం

*నగర పారిశుద్ధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం!*

*కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి – మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌ రెడ్డి*

*నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నగర పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం శ్రమించే కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. గురువారం నల్గొండ నగరపాలక సంస్థ కార్యాలయంలో శ్రీ సత్య డెంటల్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ, కమిషనర్‌ బి. వంశీకృష్ణతో కలిసి మేయర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, కార్మికులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దంత సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. శిబిరం లో డాక్టర్‌ అరవింద్‌ రెడ్డి, డాక్టర్‌ జిశాంక్‌, డాక్టర్‌ నందిని, ఎం.డి. నజీర్‌ ఖాన్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ, కమిషనర్‌ బి. వంశీకృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.