prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 5:37 pm Digital Edition : PRAJA VANI

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

*ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్…*

*ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 23*

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య శుక్రవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియను సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత నిస్తూ , ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు.