prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 7:15 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ధర్మారంలో ఇరానీ ఛాయ్ టీ పాయింట్ సందర్శన: ప్రమోద్‌ను అభినందించిన మద్దుల గోపాల్ రెడ్డి

ధర్మారం మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామవాసి, ఎంజీఆర్ అభిమాని తిరుమల ప్రమోద్ నిర్వహిస్తున్న ఇరానీ ఛాయ్ టీ పాయింట్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమోద్‌ను ఆత్మీయంగా పలకరించి, ఆయన వ్యాపార విశేషాలను తెలుసుకుని అభినందించారు. స్థానికంగా ఇలాంటి కేంద్రాలు ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని కొనియాడారు. ఆయన వెంట పాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.