ద్వారక గ్రామపంచాయతీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ద్వారక గ్రామపంచాయతీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గౌరమ్మ తల్లికి పూజలు చేసి ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులు దండేపల్లి, అక్టోబర్ 19 (ప్రజావాణి): దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ పండుగ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...