prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:30 am Digital Edition : PRAJA VANI

ద్వారక గ్రామపంచాయతీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ద్వారక గ్రామపంచాయతీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
గౌరమ్మ తల్లికి పూజలు చేసి ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులు
దండేపల్లి, అక్టోబర్ 19 (ప్రజావాణి):
దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ పండుగ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.
గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు, గ్రామస్తులు ఐకమత్యంతో వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటిచెప్పారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకున్నారు.