దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, అక్టోబర్ 31: దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పిలుపునిచ్చారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు...