prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 4:09 pm Digital Edition : PRAJA VANI

దేశ ఐక్యతకు ప్రతీక ఉక్కు మహిళ ఇందిరమ్మ

దేశ ఐక్యతకు ప్రతీక ఉక్కు మహిళ ఇందిరమ్మ…
ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ కు స్ఫూర్తి..

కొమురవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఘన నివాళులు అర్పించారు.

కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించిన ఇందిరా గాంధీ దేశ ఐక్యత, సమగ్రత, ప్రజా సంక్షేమం కోసం విశేష కృషి చేశారని అన్నారు. దేశ అభివృద్ధిలో ఆమె పోషించిన పాత్ర, తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి స్మరణీయమని తెలిపారు. ఇందిరా గాంధీ ధైర్యం, నాయకత్వ లక్షణాలు, దేశం పట్ల ఆమెకున్న అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో నిరంతరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, జిల్లా నాయకులు, యూత్ కాంగ్రెస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.