prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:24 pm Digital Edition : PRAJA VANI

దేవరుప్పుల మండలంలో పర్యటించి పలు విషాద కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

దేవరుప్పుల మండలంలో పర్యటించి పలు విషాద కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

బాధిత కుటుంబాలకు భరోసా – ఆర్థిక సహాయం అందజేత

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఆదివారం దేవరుప్పుల మండలంలో విస్తృతంగా పర్యటించి, ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించారు.

కోలుకొండ లో ఏఎంసీ డైరెక్టర్ కుటుంబానికి పరామర్శ

కొల్కొండ గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ నల్ల సత్యనారాయణ తల్లిగారు ఇటీవల మరణించగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పెద్దమాడూర్ లో గనుపాక కొండయ్య కుటుంబానికి పరామర్శ – ఆర్థిక సహాయం

అనంతరం పెద్దమాడూర్ గ్రామ కంటెస్టెంట్ సర్పంచ్ గనుపాక నరసయ్య తండ్రి గనుపాక కొండయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. కొండయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ధైర్యం చెప్పారు.

గనుపాక ఐలమ్మ కుటుంబానికి పరామర్శ – మానవతా సహాయం

అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గనుపాక రవి తల్లి గనుపాక ఐలమ్మ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్, జిల్లా నాయకులు తోటకూరి పాండు కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షులు కాడబోయిన గణేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు గోపు సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులిగిల్ల వెంకన్న, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కొంగరి ఉమేష్, రెడ్డి రాజుల రమేష్, గుగులోతు రాజేందర్, రుద్రోజు భాస్కర చారి, అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ అనూష నర్సింగరావు, రాంబోజిగూడెం సర్పంచ్ ధనలక్ష్మి భాస్కర్, కొల్కొండ గ్రామ శాఖ అధ్యక్షులు బిసు శ్రీనివాస్, వార్డు సభ్యులు పానుగంటి ప్రశాంత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.