prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:03 pm Digital Edition : PRAJA VANI

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ చింత రాజు

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ చింత రాజు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) గా ఎస్ఐ చింత రాజు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు సత్వర న్యాయం అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.