prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 9:16 pm Digital Edition : PRAJA VANI

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వర్ధన్నపేట ఏసీపీ

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వర్ధన్నపేట ఏసీపీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్ ను వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బంది పెరేడ్ ను పరిశీలించారు. అనంతరం కిట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫాం తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, క్రైమ్ వెహికల్స్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

సీడీ ఫైల్స్, పీటీ ఫైల్స్, ఇతర కేసు రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి కేసులో ఈ-సాక్ష్యా తప్పనిసరిగా నమోదు చేయాలని, దర్యాప్తులో నిర్దేశించిన గడువులను పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ ) భారత్ సుమన్, దేవరుప్పుల ఎస్ఐ ఊర సృజన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.