దేవరుప్పుల ఎస్ఐ ఊర సృజన్ కుమార్కు గిరిజన నాయకుల ఘన సన్మానం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి): జిల్లా లోని
దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో అద్భుతంగా విధులు నిర్వహించిన ఎస్ఐ ఊర సృజన్ కుమార్ బదిలీపై పాలకుర్తి కి వెళ్తున్న సందర్భంగా మండలం లోని గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బనోత్ భాస్కర్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా సజ్జన్, పలు తండాల సర్పంచులు సుధాకర్ నాయక్, అనిత-రవీందర్, మహేందర్, సుజాత-యాకన్న, నాయకులు బోడ యాకన్న, నరేందర్ నాయక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.