prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 6:33 pm Digital Edition : PRAJA VANI

దుర్గామాత ఆగమన వేడుకలకు ఎమ్మెల్యే గండ్రకు ఆహ్వానం

దుర్గామాత ఆగమన వేడుకలకు ఎమ్మెల్యే గండ్రకు ఆహ్వానం

వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆహ్వానం

గణపురం, అక్టోబర్ 11 మన ప్రజావాణి : గణపురం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించనున్న దుర్గామాత ఆగమన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. దుర్గామాత ఆగమనాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొంటే కార్యక్రమానికి మరింత శోభ చేకూరుతుందని తెలిపారు.