prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 4:33 pm Digital Edition : PRAJA VANI

దుర్గామాతకు వార్డు నెంబర్ మోత్కూర్ వెంకటేష్ కుటుంబ సమేత పూజలు

దుర్గామాతకు వార్డు నెంబర్ మోత్కూర్ వెంకటేష్ కుటుంబ సమేత పూజలు.

పరిగి/కులకచర్ల, అక్టోబర్ 19 (ప్రజావాణి )

మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి స్థానిక వార్డు సభ్యుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ఆ దుర్గమ్మ చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై నిరంతరం ఉండాలని మనసారా ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ పూజా కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు శేరి రాంరెడ్డి, చెల్లిమిళ్ల ఆనందం, టి. రాములు, లక్ష్మయ్య, లింగంగారి రాములు, భీమయ్య, వెంకటయ్య, గోపాల్, శ్రీనివాస్, రాజు, గోపాల్, తిరుపతి, వెంకటేష్, సంతోష్‌లతో పాటు భవానీ మాత, దుర్గామాత దీక్షలు స్వీకరించిన స్వాములు, మహిళలు, చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు.