దుర్గమాత మండపం వద్ద బీరప్ప యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
దుర్గమాత మండపం వద్ద బీరప్ప యూత్ ఆధ్వర్యంలో అన్నదానం మద్దూరు అక్టోబర్17, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామంలో బీరప్ప యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమాత మండపం వద్ద శనివారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంపతులు, ఉప సర్పంచ్ బీరప్ప యూత్ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు.