దుర్గమాతకు పూజలు చేసిన 7వార్డు సభ్యులు.. బోగి సరస్వతి సుధాకర్
మద్దూరు అక్టోబర్ 14, ప్రజా వాణి,
మండలంలోని లద్నూరు గ్రామంలోనీ దుర్గమాతకు గ్రామ 7వార్డు సభ్యులు బోగి సరస్వతి సుధాకర్ పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గమాత ఉత్సవాల్లో గ్రామంలో పాల్గొంటున్న బంధుమిత్రులకు ఎటువంటి ప్రమాదాలు, ఆటంకాలు జరగకుండా అమ్మవారి కృప కటాక్షం, వారికి తోడుగా ఉండి ఆనందోత్సవాల మధ్య జరుగు లాగున పండుగ వేడుకలు జరగాలని కోరుకున్నారు. ఈ పూజలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నరూ. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.