దుర్గగుడి వద్ద పోలీసుల అత్యుత్సాహం
ప్రజావాణి ప్రతినిధి విజయవాడ అక్టోబర్ 13
మీడియా ప్రతినిధులతో ఎస్ఐ దురుసు ప్రవర్తన.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ వ్యాఖ్యలు
విజయవాడ: దుర్గగుడి వద్ద విధుల్లో ఉన్న పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. మీడియా ప్రతినిధులతో ఓ ఎస్ఐ దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ “ఎవడైతే నాకేంటి ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ ఎస్ఐ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంతేకాకుండా అవసరమైతే చేయి కూడా వేస్తామన్నట్లుగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు, మీడియా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత వీడియోను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరుతున్నారు.