పోచారం భాస్కర్ రెడ్డి భరోసాతో దివ్యాంగులకు కొండంత ధైర్యం.
దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాల పంపిణీ.
పోతంగల్ మండలంలో వివరాలు సేకరిస్తున్న నాయకులు.
దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపడమే భాస్కర్ రెడ్డి లక్ష్యం.

కోటగిరి/ప్రజావాణి:-ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి మానవతా దృక్పథంతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని వారికి ధైర్యాన్ని అందించాలనే సదుద్దేశంతో పోచారం భాస్కర్ రెడ్డి భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోతంగల్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలోని దివ్యాంగులను నాయకులు స్వయంగా కలుసుకున్నారు.భాస్కర్ రెడ్డి చేపట్టిన భరోసా కార్యక్రమం ఉద్దేశాలను వారికి సవివరంగా వివరించారు.ఈ సందర్భంగా గ్రామాల వారీగా దివ్యాంగుల వివరాలను సేకరించి వాటిని పోచారం భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మండల నాయకులు తెలిపారు. సేకరించిన వివరాల ఆధారంగా అర్హులైన దివ్యాంగు లందరికీ త్వరలోనే ఉచితంగా సహాయ ఉపకరణాలు అందజేయనున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ సింధె షాజీ పాటిల్,ఉమ్మడి కోటగిరి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు,మాజీ ఎంపీపీ గంధపు పవన్,మాజీ ఎంపీటీసీ కేశ వీరేశం,ముఖ్య నాయకులు ధనరాజు,వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.