దివ్యాంగులకు అండగా భాస్కరన్న.. కృత్రిమ కాళ్లు, చేతుల అందజేతకు చర్యలు
బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకుల వెల్లడి
బీర్కూర్: మండల పరిధిలోని దివ్యాంగులకు అండగా నిలిచేందుకు భాస్కరన్న ముందుకు వచ్చారని బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారిని గుర్తించి, వారి వివరాలను సేకరించి భాస్కరన్న దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
అవసరమైన దివ్యాంగులకు లండన్ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కృత్రిమ కాళ్లు, చేతులను తెప్పించి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించి, వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు భాస్కరన్న భరోసా కల్పిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని శంకర్, యువ నాయకుడు మియాపురం శశికాంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ యామ రాములు, మండల ఉపాధ్యక్షుడు గొండ్ల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గొండ్ల రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవి, వార్డు సభ్యులు కొరిమె రఘు, ప్రశాంత్ యాదవ్, ఇందూరి గజేందర్, లక్ష్మినారాయణ, హైమద్, జంగం గంగప్ప, చింతం అంబయ్య, మేత్రి గంగారాం తదితరులు పాల్గొన్నారు.