prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 5:51 am Digital Edition : MEERASAHAB CHILUKUR

దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న రఫీ సయ్యద్‌

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు.. దయతో ఆదుకోవాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి 

కోదాడ/యర్రవరం అక్టోబర్ 18(ప్రజావాణి) కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన రఫీ సయ్యద్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఇవ్యా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్‌కు అవసరమైన ఖర్చుల కోసం దాతల సహాయం కోరుతున్నారు. రఫీ సయ్యద్‌ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి రఫీ సయ్యద్‌ ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.సహాయం చేయదలచిన వారు  8008891291 ద్వారా తమ విరాళాలను అందించవచ్చు. ప్రతి రూపాయి తమకు ఎంతో విలువైనదని, దాతల సహాయం రఫీ సయ్యద్‌ చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.