prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 3:10 pm Digital Edition : PRAJA VANI

దాచారంలో ఘనంగా పోషికాహార మాసోత్సవాలు

దాచారంలో ఘనంగా పోషికాహార మాసోత్సవాలు

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాలల పోషణ కీలకం-

సర్పంచ్ మానస రాజేందర్

బెజ్జంకి,అక్టోబర్ 1 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దాచారం గ్రామంలో గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో పోషికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని తెలిపారు. గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బైరా మానస రాజేందర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి చిన్నారుల పోషణ ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ మండల అధికారి నాగరణి, అంగన్‌వాడీ సిబ్బంది స్వరూప, పుష్ప, ఆశా కార్యకర్తలు, మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.