prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 5:47 pm Digital Edition : PRAJA VANI

దసరా సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాద్రి పృథ్వీరాజ్

*దసరా పండుగ సందర్భంగా శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి తో కలిసి*

*మాజీ మంత్రి హరీష్ రావు ని కలిసిన మాద్రి పృథ్వీరాజ్*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 22 సంగారెడ్డి జిల్లా*

విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ని పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి మాద్రి పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగ సందర్భంగా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం మన సంప్రదాయంలో ఒక గొప్ప ఆచారం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.

పెద్దల ఆశీస్సులు, ఆప్యాయతలు, సంప్రదాయాల పరిరక్షణతో పండుగల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే సందేశంతో ఈ దసరా వేడుకలను ఆనందంగా జరుపుకోవడం జరిగింది అని పృథ్వీరాజ్ అన్నారు.