prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 9:00 pm Digital Edition : PRAJA VANI

దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, జర్నలిస్టులు

దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, జర్నలిస్టులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ప్రముఖులు

శేరిలింగంపల్లి, అక్టోబర్ 25(ప్రజావాణి)

విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ అరికెపూడి గాంధీని పలువురు నాయకులు, జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ భేటీలో 124వ డివిజన్ లేబర్ సెల్ ఇన్‌ఛార్జ్ రవీంద్ర, జర్నలిస్ట్, అంబేద్కరైట్, సామాజిక సేవకుడు భీమ్ గిరి, జర్నలిస్ట్ నవీన్ యాదవ్, జినుగు పుల్లారావు (జేపీ రావు) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు, జర్నలిస్టులు విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.