prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 9:58 pm Digital Edition : PRAJA VANI

దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి

*దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి*

మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్ :15

*అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మ*

*స్టేడియం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, దసరా వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచన*

*కార్యక్రమం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, భవాని యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, సభ్యులు, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీహరి*

సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం పరిశీలించారు. రావణ దహనం కోసం సిద్ధం చేస్తున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మతో పాటు బాణసంచా కాల్చేందుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

గత ముప్పై ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ రావణాసురుడి బొమ్మ దహనం, పెద్ద ఎత్తున బాణసంచా ప్రదర్శనతో పాటు ప్రముఖ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జగ్గారెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా స్టేడియంతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జగ్గారెడ్డి సూచించారు. ముళ్లకంపలను తొలగించి, చెత్తాచెదారం లేకుండా మైదానాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందికి, ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, భవాని యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బెస్త నగేష్, సభ్యులు, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్ , శ్రీహరి తదితరులు పాల్గొన్నారు