prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:46 pm Digital Edition : PRAJA VANI

దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ సమావేశం

*దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ సమావేశం…*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09*

దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో శుక్రవారం రోజు సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. నూతన గ్రామ పంచాయతీలు , మండలాలు , జిల్లాల ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని ఉత్సవాల నిర్వాహనపై పలు సలహాలు సూచనలు అందించిన మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ భాలు , మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు , పట్టణ అధ్యక్షులు ఏ.వి కిరణ్ కుమార్ , నాయకులు సుబ్బూరు బీరు మల్లయ్య , సిద్దుల పద్మ , యాదగిరిగుట్ట మాజీ జెడ్పిటిసి తోటకూర అనురాధ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.