prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 4:03 pm Digital Edition : PRAJA VANI

దళిత మహిళ మాధవిశపై దాడిని చేసిన అమర్ నాధ్ ను అరెస్ట్ చేయాలి

ఎగ్నిందితుడి అరెస్ట్ లో పోలీసులు నిర్లక్ష్యం వీడాలి

కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు

పీకే మల్లేపల్లిలో మాధవి కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాసంఘాల రాష్ట్ర నేతలుమ

అక్టోబర్ 2 న గ్రామసభ జరుగుతుండగా దళిత మహిళ వివోఏ గనిపల్లి మాధవి నీ కులం పేరుతో దూషించి కాలితో తల్లి కింద పడేసి హత్యాయత్నానికి పాల్పడిన పీకే మల్లేపల్లి గ్రామ పెత్తందారుడు కొప్పోలు అమర్ నాధ్ గౌడ్ ను తక్షణమే అరెస్టు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు వీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ కెవిపిఎస్ నల్గొండ జిల్లాకార్యదర్శి పాలడుగు నాగార్జున పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీ.కే. మల్లెపల్లి గ్రామంలోబాధిత దళిత మహిళ వీఓఏ గనిపల్లి మాధవి కుటుంబాన్ని కేవీపీఎస్, విసికే ప్రజాసంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు పరామర్శించారు.
మాధవి నుండి ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం దాడిచేసిన దుండగుడి భార్య గతం లో డ్వాక్రా గ్రూపు సభ్యురాలిగా గ్రామ సర్పంచ్ గా ఉండడం రెగ్యులర్ డబ్బులు చెల్లించకపోవడంతో పలుమార్లు అడిగినానని సర్పంచ్ గా ఉన్న మమ్ముల్ని డబ్బులు అడుగుతావ అని అప్పటి నుండి కక్ష్య పెంచుకున్నదాన్ని తాను అవినీతికి పాల్పడితే జిల్లా అధికారులకు పిర్యాదు చేసి చట్టబద్ధంగా వ్యవహరించాలి కాని గ్రామ సభలో తనను మాదిగ లం … అని కులం పేరుతో దూషించి కింద పడేసి కొట్టి హత్య చేయడానికి ప్రయత్నించడని ఆవేదన వ్యక్తం చేశారు తనకు బెస్ట్ వి ఓ ఏ అవార్డ్ వచ్చిందని తనను కావాలని కక్షతో దౌర్జన్యం చేస్తున్నారని. చెప్పారు సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను గ్రహించాలన్నారు త లక్షణమే అరెస్టు చేయాలని ఆమె చెప్పింది. అమర్ నాధ్ తో తనకు ప్రాణహాని ఉందని తమ కుటుంబానికి ఏమి జరిగినా అమర్ నాథ్ కుటుంబం బాధ్యత వహించాలనీ ఆమె చెప్పారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ గ్రామ సభ సందర్భంగా గనిపల్లి మాధవిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడిన ఘటన అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చిందన్నారు దళిత మహిళపై బహిరంగంగా దాడి చేయడం ప్రజాస్వామ్య సమాజంలో సహంచగూడదని చెప్పారు గ్రామ సభలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సి ఉండగా, ఒక మహిళను కులం పేరుతో అవమానించడం, అసభ్య పదజాలంతో దూషించడం, దాడికి పాల్పడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత దళిత మహిళకు తక్షణ రక్షణ కల్పించడంతో పాటు, ఆమెకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వి సి కే రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ మాట్లాడుతూ బహిరంగంగా ప్రజల సమక్షంలో దళిత మహిళపై దాడి జరిగితే పోలీసులు నేటి వరకు అరెస్ట్ చేయకపోవడం విచారకరమన్నారు దాడులు జరిగినప్పుడు చట్టపరమైన పూర్తి రక్షణ కల్పించాలన్నారు గ్రామంలో పెత్తందారులు మహిళలందరినీ ఏకం చేసి మాధవి కుటుంబం పై దౌర్జన్యానికి ఉసిగొల్పు తున్నారని చెప్పారు
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పర్యవేక్షించి, ఆ జిల్లాలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, కుల వివక్ష ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చట్టపరమైన రక్షణ, న్యాయం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దళితులు, గిరిజనులపై కుల వివక్షకు, దాడులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు, సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ దారుణాన్ని ఖండించాలన్నారు.
ఈ పర్యటనలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు కోడి రెక్క మల్లయ్య ,దేవరకొండ నియోజక వర్గ కార్యదర్శి పెరిక విజయ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాములు, అబ్బయ్య నరసింహ సైదులు తదితరులు పాల్గొన్నారు.