దళిత మహిళపై దాడి దురదృష్టకరం
బోడుప్పల్ 398వ వారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల
మహిళల జోలికొస్తే కఠిన చర్యలు అమలు చేయాలి
అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య
మేడిపల్లి అక్టోబర్ 04( మన ప్రజావాణి) గాంధీ జయంతి రోజు దళిత మహిళపై దాడి దురదృష్టకరమని,మహిళల జోలికొస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య అన్నారు.ఈ మేరకు బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జ్ణానమాల అలంకరణ చేసి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకునే కార్యక్రమం జరిగింది.ఈ ఆదివారం 398వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య పాల్గొని
ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామం అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజున గనిపల్లి మాధవి అనే దళిత మహిళ పైన అదే గ్రామానికి చెందిన కొప్పోలు అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెపై దాడి చేశాడు.ఈ సంఘట
నను అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తీవ్రంగా ఖండిస్తుందని,మహిళలపై దాడి చేయడం దురదృష్ట కరమని తక్షణమే దాడి చేసిన వ్యక్తి పై ఎస్సీ అట్రాసిటీ కేసుతోపాటు పిడి యాక్ట్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని,అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మహిళలపై దాడి చేయడం హేయమైన చర్య అని నత్తి మైసయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య,బోడుప్పల్ అరుంధతి మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరుగుల యాకయ్య, సాయి బండారి,శ్రీధర్ గుప్తా,రాపోలు వెంకటేష్, చిల్ల అంజయ్య,గుంజి శ్రీనివాస్,డింపు తదితరులు పాల్గొన్నారు.