prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:41 am Digital Edition : PRAJA VANI

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు వాయిదా

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు వాయిదా

• మంత్రుల సూచన మేరకు నిర్ణయం.. వచ్చే వారం సంగారెడ్డిలో మహాసభలు

సంగారెడ్డి, అక్టోబర్ 06: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

ఈ నెల 7న సంగారెడ్డిలో నిర్వహించాల్సిన దళిత జర్నలిస్టుల ఫోరం ( డి జె ఎఫ్) 11వ రాష్ట్ర మహాసభలను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఫోరం రాష్ట్ర నాయకులు తెలిపారు.
మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. డేవిడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమణి అశోక్ సోమవారం ప్రకటన విడుదల చేశారు.
మహాసభలకు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సి ఉండగా, అదే తేదీన ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో వారు పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా కమిటీల ముఖ్య నాయకులు సమావేశమై చర్చించిన అనంతరం తేదీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే వారం సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహిస్తామని, మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని నాయకులు తెలిపారు. రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు తేదీ మార్పును గమనించి సహకరించాలని, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.