prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 2:13 pm Digital Edition : PRAJA VANI

దళిత జర్నలిస్టుల మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి

దళిత జర్నలిస్టుల మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి

వట్పల్లి, అక్టోబర్ 1: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో అక్టోబర్ 7న నిర్వహించనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను వట్పల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. స్థానిక ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి జంగేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బేగరి దాసయ్య మాట్లాడుతూ దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 7న నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలకు అందోల్ నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన ప్రతి దళిత జర్నలిస్టు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొఠారి ప్రభాకర్, మాదిగ బుచ్చయ్య, జోగ్యల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.