దమ్ము ధైర్యం ఉంటే బద్వేల్ మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించండి! బద్వేల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టు.పోరుమామిళ్లకు తరలింపు

బద్వేల్ అక్టోబర్ 18 ప్రజావాణి బద్వేల్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించి, బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి,ఎమ్మెల్సీ శ్రీ డి.సి.గోవిందరెడ్డి,నియోజకవర్గ యువ నాయకుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి, బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సాయి కృష్ణ తో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోరుమామిళ్లకు తరలించారు. నాయకులను తరలించే క్రమంలో పార్టీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా,పోలీసులు వారిని చెదరగొట్టి ముందుకు సాగారు....