దమ్మనపల్లె పంచాయతీ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా లక్కినేని సురేష్ ఖరారు: బద్వేల్ ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
వైఎస్సార్ కడప జిల్లా: అక్టోబర్ 29 ప్రజావాణి జిల్లాలోని పోరుమామిళ్ల మండలం, దమ్మనపల్లె పంచాయతీ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా దమ్మనపల్లె పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా లక్కినేని సురేష్ పేరును టీడీపీ అధికారికంగా ప్రకటించింది.బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డి అభ్యర్థుల పేర్లను అధికారికంగా వెల్లడించారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేసే సమర్థులైన నాయకులకు ఈ అవకాశం...