పోరుమామిళ్ల (కడప జిల్లా):అక్టోబర్ 27 ప్రజావాణి జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తన జేత్రయాత్రను మరింత ఉధృతం చేస్తూ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. పోరుమామిళ్ల మండల పరిధిలోని అత్యంత కీలకమైన దమ్మనపల్లి పంచాయతీ నుంచి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అధికారిక ఎంపీటీసీ అభ్యర్థిగా స్థానిక ప్రజాదరణ పొందిన నాయకుడు లక్కినేని సురేష్‌ను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్ఠానం ఈరోజు అధికారికంగా ‘బీ-ఫామ్’ అందజేసింది. స్థానిక నియోజకవర్గ ముఖ్య నేతలు మరియు పార్టీ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సురేష్‌కు బీ-ఫామ్ అందజేయడంతో దమ్మనపల్లి వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది, పార్టీని నమ్మకాన్ని నిలబెట్టిన ప్రజా నాయకుడు లక్కినేని సురేష్ మొదటి నుండి దమ్మనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తిగా, ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయనకున్న నిబద్ధత, సేవాతత్పరతను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం, ఆయనను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్మనపల్లి ఎంపీటీసీ స్థానానికి సరైన అభ్యర్థిగా ఎంపిక చేసింది. బీ-ఫామ్ అందుకున్న అనంతరం లక్కినేని సురేష్ మాట్లాడుతూ, “నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దమ్మనపల్లి కోటపై పసుపు జెండాను ఎగరేసి, ఈ స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తాను” అని ధీమా వ్యక్తం చేశారు.అభివృద్ధే ధ్యేయంగా కూటమి ఎన్నికల శంఖారావం దమ్మనపల్లి పంచాయతీలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా సురేష్ తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలను మరియు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.లక్కినేని సురేష్‌కు బీ-ఫామ్ లభించిన విషయం తెలియగానే దమ్మనపల్లి మరియు పోరుమామిళ్ల మండలానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తెలుగు యువత మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, మిఠాయిలు పంచుకుంటూ జై తెలుగుదేశం.జై చంద్రబాబు. జై లోకేశ్ అంటూ నినాదాలు చేశారు.దమ్మనపల్లిలో టిడిపి సాధించబోయే భారీ విజయానికి ఈ బీ-ఫామ్ పంపిణీయే తొలి అడుగు అని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.