దండేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక
అధ్యక్షుడిగా కుంచె ప్రసాద్.. ప్రధాన కార్యదర్శిగా సేర్ల చక్రపాణి
దండేపల్లి, అక్టోబర్ 12 (ప్రజావాణి): దండేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించగా, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కుంచె ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా సేర్ల చక్రపాణి ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గ వివరాలు ఇలా ఉన్నాయి.
అధ్యక్షుడు: కుంచె ప్రసాద్
ప్రధాన కార్యదర్శి: సేర్ల చక్రపాణి
ఉపాధ్యక్షులు: ముత్తె రమేష్, బొడ్డు జగన్
సంయుక్త కార్యదర్శి: కొల్లూరి సతీష్
కార్యదర్శులు: అత్తె సుధాకర్, కత్తెర మల్లేష్
అధికార ప్రతినిధి: తోట మల్లేష్
ప్రచార కార్యదర్శి: కుర్సింగ అరుణ్
కోశాధికారి: బచ్చల సుభాష్
కార్యవర్గ సభ్యులు: వెలుమల తిరుపతి, సంతపూర్ కిషోర్, బుర్ర తిరుపతి గౌడ్, వేణుగోపాల్.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పాత్రికేయుల ఐక్యతకు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.